వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడి

Oct 30 2026 12:57 AM | Updated on Oct 30 2026 12:57 AM

ద్వారకాతిరుమల: స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం రాత్రి మండలంలోని వెంకటకృష్ణాపురంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రామాలయం వద్ద రోడ్డుపై బైక్‌ నిలిపి ఉంచిన విషయమై జరిగిన గొడవలో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్త దాడి చేశాడు. అనంతరం పోలీస్టేషన్‌లో ఎదురుకేసు పెట్టాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు వైస్సార్‌ సీపీ కార్యకర్త అంజిబాబు తన బైక్‌ను స్థానిక రామాలయం వద్ద రోడ్డుపై నిలిపి ఉంచాడు. తిరిగి అతడు ప్రచారంతో రామాలయం వద్దకు చేరుకోగా, అదే సమయంలో టీడీపీ శ్రేణుల ప్రచారం ఎదురుపడింది. ఆ సమయంలో రోడ్డుపై బైక్‌ ఎవరు పెట్టారంటూ ముమ్మారెడ్డి నాగరాజు దూషించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంతలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త ములకాల వెంకటేశ్వరరావు బైక్‌ను పక్కకు తీశాడు. బైక్‌ రోడ్డుపై ఉన్నంత మాత్రాన దూషించడం ఏమిటని అంజిబాబు ప్రశ్నించడంతో నాగరాజు అతడిపై దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే అంజిబాబు ప్రతిఘటించే క్రమంలో నాగరాజు పెదవికి గాయమైంది. దీంతో నాగరాజు స్థానిక పోలీస్టేషన్‌లో అంజిబాబు, అతడి అన్నయ్య బుసనబోయిన నాగరాజుపై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉంటే ఈ దాడిలో గాయపడిన అంజిబాబును కుటుంబ సభ్యులు తొలుత 108లో ద్వారకాతిరుమల పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement