ఉంగుటూరు: తుపానుతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందకుండా తుపాను దెబ్బతీసిందన్నారు. జిల్లాలో అత్యధికంగా వరి పండించే ఉంగుటూరు మండలంలో గురువారం ఆయన ప ర్యటించారు. ఉప్పాకపాడు, బొమ్మిడి, బాదంపూ డి, నారాయణఫురం తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి చేలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విపత్తులతో నష్టపోయిన రైతులను సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నామని, అయితే ప్రస్తుతం కూటమి ప్రభు త్వం ఎలాంటి సాయం అందించడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఉచిత పంటల బీమాతో ఆదుకోగా.. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో చాలామంది రైతులు ఇన్సురెన్స్ ప్రీమి యం చెల్లించలేదన్నారు. దీంతో పంట నష్టపోతే పరిహారం అందని పరిస్థితి నెలకొందన్నారు. అలా గే కౌలు రైతులకు గత ప్రభుత్వంలో రైతు భరోసా అందిస్తే ఇప్పుడు రాకపోవడంతో వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అలాంటి రైతులందరినీ ఆదుకోవాలని కోరా రు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చే యాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తమ కు పలురకాలుగా మేలు జరిగిందని, ప్రస్తుత కూ టమి ప్రభుత్వం ఏమీ అందడం లేదని రైతులు వా సుబాబు దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యెలిశెటి పాపారావు బాబ్జి, మండల పార్టీ అధ్యక్షుడు మరడ మంగరావు, నాయకు లు అడపా శ్రీను, బండారు నాగరాజు, పెనుగొండ బాలకృష్ణ, దాసిరి అప్పన్న తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు


