మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించబోమని నూజివీడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు అన్నారు. 8లో u
రెండు ఎకరాలు కౌలు సాగుచేస్తున్నాను. ఇప్పటికే ఎకరాకు రూ.27 వేల వరకు పెట్టుబడి ఖర్చులయ్యాయి. గతేడాది మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగిస్తే ఇప్పుడు అర్నబ్. పంట మొత్తం నేలనంటి సర్వనాశనం అయిపోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
– తోట పెద్దిరాజు, కౌలు రైతు, రాయకుదురు
ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాను. ప్రస్తుతం పంట చిరుపొట్ట దశలో ఉంది. గోస్తనీ నది ముంపుతో గతే డాది తొలకరి నష్టపోయాం. ప్రభుత్వ పెద్దలు వచ్చి ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చినా ఏ సాయం చేయలేదు. ఇప్పుడు పంట మొత్తం నేలనంటింది.
– మారిశెట్టి శ్రీనివాస్, కౌలు రైతు, ఎస్.శిలీంద్రపర్రు
ఈ ఏడాది పంట బాగా పండింది. రెండు వారాల్లో పంట చేతికొస్తుందని ఆశించాం. ఒక్కరోజులోనే వర్షం మొత్తం తుడిచిపెట్టేసింది. ఇప్పటివరకు మూడెకరాలకు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాను. నేలనంటిన పంటను కోస్తే కూలీ ఖర్చులు కూడా రావు.
– ఎస్.సన్యాసిరావు, రైతు, ప్రత్తిపాడు


