ముదినేపల్లి రూరల్: తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ మ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) డిమాండ్ చేశారు. తుపాను సహాయక చర్యలపై ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలు మానుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. మండలంలోని చిగురుకోట, గంగాపురం గ్రామాల్లోని దెబ్బతిన్న వరి చేలను గురువారం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. గతేడాది మోంథా తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకుండా దగా చేసిందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో నష్టం జరిగిన నెల రో జుల్లోనే పరిహారం అందించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులపై కక్ష క ట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు. రైతులను ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ ఏశారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఆరుగాలం చమటోడ్చి, కష్టించి సాగుచేసిన పైరు కళ్లముందే నేల కూలి నష్టపరచడం దారుణమన్నారు. ఎల్నినో ప్ర భావంతో ఈ సార్వా సీజన్లో సాగునీరు అందక రై తులు అష్టకష్టాలు పడి ఏదో రకంగా పైరును కాపాడుకుంటే చివరి దశలో ఇలా నష్టపోవడం బాధాకరమన్నారు. మండలంలో వరి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని పారదర్శకంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తిచేసి నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరా రు. చిగురుకోట ఎంపీటీసీ అభ్యర్థి పేరం ధర్మరాజు, పార్టీ ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమ టి విష్ణువర్ధన్, నాయకులు ఉన్నారు.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


