బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కేవీ కృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటివరకు ముంబై ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ వి భాగంలో ప్రొఫెసర్‌గా సేవలందించారు. ఆయనకు రవాణా వ్యవస్థల ఇంజనీరింగ్, పట్టణ రవాణా ప్రణాళిక రంగాల్లో నాలుగు దశాబ్ధాలుగా పైగా అనుభవం ఉంది. కాకినాడలోని జేఎన్‌టీయులో 1984లో సివిల్ ఇంజనీరింగ్, 1986లో మద్రాస్ ఐఐటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తిచేశారు. 1996 లో ముంబై ఐఐటీలో చేరి ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి, డీన్‌లు అభినందించారు.


