ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర లోకాయుక్త చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు సోమవారం సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. అంతక ముందు మల్లికార్జునరావు తూర్పు యడవల్లిలోని సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు.


