తొలి విడత ప్రవేశాలకు షెడ్యూల్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఏపీఈఏపీసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ర్యాంకు ఆధారంగా ఏ కళాశాలలో, ఏ బ్రాంచ్ లో సీటు లభిస్తుందోనని ఇప్పటికే సమాచారం విద్యార్థులు సేకరించుకున్నారు. తమకు నచ్చిన కళాశాలలో తాము చదవగలిగే కోర్సుల్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఏ నిర్ణయానికి రాలేక డైలమాలో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్ సీఎస్‌ఈ, ఐటీ, డేటాసైన్స్, ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ వంటి వాటిపై ఉండగా.. ఏఐ ప్రభావం ఆర్థిక మాంధ్యం, ఐటీ రంగంలో తగ్గిన క్యాంపస్ సెలెక్షన్స్ నేపథ్యంలో కోర్ బ్రాంచులు మెకానికల్, ఈఈఈ, సివిల్ వంటి వాటిపైనా దృష్టి సారించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు.
కొత్త కోర్సులు.. కోటి ఆశలు
ఇంజనీరింగ్‌లో సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తగా వస్తున్న కోర్సుల గురించి తెలుసుకునేందుకు భవిష్యత్‌కు బంగారు బాటలు పడే అవకాశం ఉందని విద్యారంగం నిపుణులు అంటున్నారు. సీఎస్‌ఈలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (వీఎల్‌ఎస్‌ఐ) డిజైన్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, నెట్ వర్కింగ్, అల్గారిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ప్రోగ్రామ్ డిజైన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ హార్డ్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్‌టైల్ వంటి కొత్త బ్రాంచీలను పరిశీలించవచ్చని అంటున్నారు.
ఈనెల 20 నుంచి 29 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు
22 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో విద్యార్థులు అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన
25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
వచ్చేనెల 1న వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం
వచ్చేనెల 6న సీట్ల కేటాయింపు
వచ్చేనెల 7 నుచి 13 వరకు కళాశాలల్లో ప్రవేశాలు
వచ్చేనెల 10 నుంచి తరగతుల ప్రారంభం
కొత్తబంగారు లోకం
ఇంజనీరింగ్ ప్రవేశాలకు పచ్చజెండా
తొలి విడత కన్వీనర్ కోటారిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ
20 నుంచి షెడ్యూల్
25 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం
వచ్చేనెల 10 నుంచి తరగతులు
ఏఐ సృష్టించిన చిత్రం


