జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

కుట్రలను తిప్పికొట్టేలా..

ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

నేరుగా అనుసంధానమయ్యేలా..

అధినేత జగన్‌తో కార్యకర్తల అనుసంధానం

ప్రతి కార్యకర్త డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌ పిలుపు

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ నేతలు, కార్యకర్తలను అనుసంధానం చేస్తూ యాప్‌ను రూపొందించారనీ.. జగన్‌ 2.0 సూపర్‌యాప్‌ ప్రతి కార్యకర్త ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) పిలుపునిచ్చారు. సమన్వయకర్తలు కొఠారు అబ్బయ్య చౌదరి (దెందులూరు), కంభం విజయరాజు (చింతలపూడి), మామిళ్లపల్లి జయప్రకాష్‌ (ఏలూరు)తో కలిసి ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జగన్‌ 2.0 సూపర్‌ యాప్‌ను డీఎన్నార్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను పార్టీ అధినేతతో అనుసంధానించే ప్రత్యేక వేదికే జగన్‌ 2.0 సూపర్‌యాప్‌ అన్నారు. కూటమి కుట్రలను తిప్పికొడుతూ, ప్రభుత్వ దురాగతాలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు వైఎస్‌ జగన్‌ సూపర్‌ యాప్‌నకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్‌గురునాథ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయబాబు, వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట మోహనరావు, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్‌ అధ్యక్షుడు ముంగర సంజయ్‌కుమార్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, సోషల్‌ మీడియా జిల్లా అధ్యక్షుడు చిక్కాల దుర్గాప్రసాద్‌, లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రాజేష్‌, వలంటీర్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు భోగిశెట్టి పార్వతి, లీగల్‌సెల్‌ రాష్ట్ర కార్యదర్శి డీవీ రామాంజనేయులు, బీసీ సెల్‌ నగర అధ్యక్షుడు కిలాడి దుర్గారావు, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్‌, సోషల్‌ మీడియా నగర అధ్యక్షుడు పచ్చిపులుసు సుజన్‌, లీగల్‌సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్‌ తదితరులు ఉన్నారు.

చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకను నొక్కాలనే టీడీపీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు యాప్‌ దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి కార్యకర్త, నాయకుడు తమ కష్టాన్ని, బాధను, సమస్యలను అధినేత వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లవచ్చన్నారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ సిద్దాంతాలు, ఆశయాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు యాప్‌ ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా బలమైందనీ, దెబ్బకొట్టాలనే కుట్రలతో టీడీపీ కూటమి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని వాటికి చెక్‌ పెట్టేందుకు జగన్‌ 2.0 సూపర్‌యాప్‌ కార్యకర్తల చేతిలోకి వస్తుందన్నారు.

ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ నాయకులు, కార్యకర్తలకు నేరుగా, వేగవంతంగా చేరవేయాలనే సంకల్పంతో ఈ సూపర్‌ యాప్‌ను డిజైన్‌ చేశారని చెప్పారు. దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానం అయ్యే అవకాశం ఏర్పడిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement