డీఆర్వోగా శ్రీదేవి | - | Sakshi
Sakshi News home page

డీఆర్వోగా శ్రీదేవి

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

డీఆర్వోగా శ్రీదేవి బైక్‌ అదుపుతప్పి యువతి మృతి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా రెవెన్యూ అధికారిగా శ్రీదేవి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒంగోలు జిల్లాలో కృష్ణపట్నం–హైదరాబాద్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆమెకు ప్రభుత్వం పదోన్నతి కల్పి స్తూ ఏలూరు డీఆర్వోగా నియమించింది. ఆ మెను కలెక్టరేట్‌ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు శివారు జాతీయ రహదారి సమీపంలోని ఇంద్రప్రస్థ వద్ద మో టారుసైకిల్‌ అదుపుతప్పి ఓ యువతి దుర్మర ణం పాలయ్యింది. వివరాలిలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌ ప్రాంతానికి చెందిన వేముల జయంతి అనే యువతి, మేనమామ కొండబాబుతో కలి సి మోటార్‌సైకిల్‌పై ఏలూరు వచ్చారు. తిరిగి వెళుతుండగా శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఘటనా స్థలం వద్ద మోటారు సైకిల్‌ అదుపుతప్పింది. జయంతి, కొండబాబుకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్ప త్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలే దు. ఆ సమయంలో ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ నందకిషోర్‌ అటుగా వెళుతూ వెంటనే స్పందించారు. వారిద్దరినీ ఏ లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. వైద్యు లు పరీక్షించి జయంతి మార్గమధ్యలోనే మృతిచెందినట్టు నిర్ధారించారు. వెంటనే ఎవరూ ముందుక రాకపోవడం, సకాలంలో 108 అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవటంతో యు వతి మృతిచెందినట్టు చెబుతున్నారు. జీజీహెచ్‌ లో మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement