ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహించనున్నట్టు జేసీ అభిషేక్ గౌడ తెలిపారు. ఈ మీట్‌లో విద్యా ప్రమాణాల స్థాయి, పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. లీప్ యాప్‌ను విద్యార్థుల తల్లితండ్రులు డౌన్‌లోడ్ చేసుకుంటే టీచర్స్ అటెండెన్స్, తమ పిల్లల విద్యా పురోగతి స్థాయి మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుందన్నారు. పీటీఎంను ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించాలన్నారు. సోమవారం 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో సన్మానిస్తామని జేసీ చెప్పారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో తల్లికి వందనం పథకం లబ్ధి కోసం ఎస్సీ విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవాలని సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి ముక్కంటి ప్రకటనలో తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం రూ.13 వేల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. సమీపంలోని పోస్టాఫీస్‌లో ఐపీపీబీ అకౌంట్‌తో పోస్టల్ ఖాతా తెరవవచ్చ ని సూచించారు. మరిన్ని వివారలకు సీనియర్ అసిస్టెంట్ సీహెచ్ శ్రీనివాస్, 95022 28533, పర్యవేక్షకుడు బి.సుశీల్‌కుమార్, 77991 41999ను సంప్రదించవచ్చన్నారు.


