దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 367.98 కోట్ల విలువైన 15.14 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. శుక్రవారం వేలం కేంద్రాలకు 4,449 బేళ్లు అమ్మకానికి రాగా, 2,628 బేళ్లు కొనుగోలు చేశారు. కొనుగోలుదారులు 1,821 బేళ్లను తిరస్కరించారు. కిలో గరిష్ట ధర రూ.292, కనిష్ట ధర రూ. 150, సగటు ధర రూ. 248.37 లభించినట్టు ఆయన తెలిపారు. ఐదు వేలం కేంద్రాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో సగటు ధర రూ. 243.06 ఉందని ఆయన వివరించారు. దేవరపల్లి వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 2.28 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ.238.12, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 3.23 మిలియన్ల కిలోలు విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 243.24, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 3.59 మిలియన్ల కిలోలు విక్రయం సరగ్గా, కిలో సగటు ధర రూ. 242.45, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 3.13 మిలియన్ల కిలోల పొగాకు విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 242.52, గోపాలపురం వేలం కేంద్రంలో 2.88 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 248.15 పలికినట్టు సురేంద్రకుమార్ తెలిపారు. గరిష్ట ధర స్వల్పంగా పెరిగినా, మీడియం, లోగ్రేడు పొగాకు ధరల్లో కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎక్స్ గ్రేడు పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.


