● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
● గుడ్డిగూడెంలో ఘటన
గోపాలపురం: ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే. గుడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు శుక్రవారం వరినాట్లకు వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్‌పై వస్తుండగా గుడ్డిగూడెం వద్ద గల కొవ్వాడ కాలువలోకి ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుగ్గనబోయిన పద్మ (42) అక్కడికక్కడే మృతి చెందగా, సుగ్గనబోయిన తాయారు, కత్తవ నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. స్వల్ప గాయాలైన అడ్డ పోశమ్మ, అడబాల వెంకటలక్ష్మి, సిరిగినీడి రామలక్ష్మి, కత్తవ అచ్చమ్మలకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు. సంఘటనా స్థలాన్ని దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి