
బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలి
● కూటమి మోసాలకు
ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
రాజమహేంద్రవరం రూరల్: అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. ఆయన శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శులకు పలు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించినా, పార్టీ సదరు వ్యక్తులతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కనీసం రైతులకు యూరియా సరఫరా కూడా చేసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తాడాల విష్ణుచక్రవర్తి, దాసి వెంకట్రావు, కందుల శ్రీనాథ్, పటాన్ ఆన్సర్ బాషా, జుట్టా ఏడుకొండలు, కోర్ల ఉదయభాస్కర్ పాల్గొన్నారు.