కర్యాట్‌ టైమ్‌ | - | Sakshi
Sakshi News home page

కర్యాట్‌ టైమ్‌

Aug 24 2025 7:32 AM | Updated on Aug 24 2025 7:32 AM

కర్యా

కర్యాట్‌ టైమ్‌

మూషికాల బెడదను నివారిస్తాం

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంఽధించి పంట పొలాల్లో ఎలుకల బెడద అధికంగా ఉందని గుర్తించాం. అందులో భాగంగా మూషికాల బెడదను నివారించి రైతులకు స్వాంతన చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలుకల ఉధృతిని నివారించేందుకు బ్రోమోడయోలిన్‌ మందును రైతులకు సరఫరా చేయబోతున్నాం. అలాగే ఎలుకల నిర్మూలనకు పూర్వ సంప్రదాయ రీతికి అనుగుణంగా ఎలుకల కన్నాల్లో పొగను నింపి నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

– సీహెచ్‌కేవీ చౌదరి, వ్యవసాయ

సహాయ సంచాలకుడు, ఆలమూరు

ఆలమూరు: ఎలక చిన్నదే.. సాగులో తెచ్చే నష్టం మాత్రం పెద్దది. అసలే ఖరీఫ్‌ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ సమస్య ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరి పంటపై మూషికాల దాడి అధికమైంది. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క ప్రతికూల పరిస్థితులు, ఇంకోపక్క ముషికాల బెడద కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే పంట చేతి కొచ్చే సమయానికి మరింత నష్టాన్ని చేకూర్చుతాయని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంకా బ్రోమోడయోలిన్‌ మందును పంపిణీ చేయకపోవడంతో రైతులను మనోవేదనకు గురిచేస్తుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.40 లక్షల మంది రైతులు ఖరీఫ్‌ సాగు చేస్తున్నారు. అందులో సుమారు 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టగా, మిగిలిన పొలాల్లో సాధారణ పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఈ సీజన్‌లో రైతులు అధిక విస్తీర్ణంలో స్వర్ణ (ఎంటీయూ 1318), తక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 7,029, విత్తనాల కోసం బొండాలు (ఎంటీయూ 3,626), పీఆర్‌ 126, ఎంటీయూ 1121 రకాన్ని సాగు చేస్తున్నారు.

ఇంకా స్పందించక..

ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఏటా బ్రోమోడయోలిన్‌్‌ మందును నూకలు, నూనె మిశ్రమంతో కలిపి రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పంట పొలాల్లో మూషికాల బెడద ఎక్కువై పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంట పొలాల్లో ఎలుకలు తినేదాని కన్నా దాదాపు పది రెట్లు పంటను పాడుచేసే అవకాశం ఉంది. దీంతో పిలుక దశలోనే ఎలుకలను నిర్మూలిస్తే చిరు పొట్ట దశకు చేరుకునే సరికి వరి పంటకు సంబంధించి నష్ట నివారణకు దోహదపడుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ స్పందించి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్‌ మందును త్వరితగతిన పంపిణీ చేయాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతుంది.

ఇదో అదనపు ఖర్చు

పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకలను సంప్రదాయ పద్ధతిలో పట్టించేందుకు అఽధిక ఖర్చు అవుతుంది. చిలుకలు పండ్లను కొరికి పడేసినట్టు ఎలుకలు వరి దుబ్బులను కొరకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వరి పంటను పూర్తి స్థాయిలో రక్షించాలనుకునేందుకు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బుట్టల సహాయంతో, పొగపెట్టే విధానంతో ఎలుకలను మట్టుబెట్టే చర్యలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరం భూమిలో సరాసరి సుమారు 50 ఎలుకలకు పైగా పట్టివేత జరుగుతుండగా, ఒక్కొక్క ఎలుకకు కార్మికులు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు ఎలుకల నివారణకే రూ.మూడు వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టేవారికి అదే స్థాయిలో డిమాండ్‌ కూడా ఉంది.

సామూహిక నివారణ సాధ్యమేనా!

వ్యవసాయ శాఖ ఏటా పంపిణీ చేసే బ్రోమోడయోలిన్‌ మందు సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టడం ద్వారా పంట పొలాల్లో అధిక భాగం ఎలుకలను నిర్మూలించేందుకు అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యవసాయ శాఽఖ చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతుంది. అయితే బ్రోమోడయోలిన్‌ మందును ఇంకా పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో సామూహిక ఎలుకల నివారణ సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఫ పంటలపై ఎలక్కొట్టుడు

ఫ పిలక దశలో పంట ధ్వంసం

ఫ నివారణకు అధికారుల చర్యలు శూన్యం

ఫ ఆందోళనలో అన్నదాతలు

కర్యాట్‌ టైమ్‌1
1/3

కర్యాట్‌ టైమ్‌

కర్యాట్‌ టైమ్‌2
2/3

కర్యాట్‌ టైమ్‌

కర్యాట్‌ టైమ్‌3
3/3

కర్యాట్‌ టైమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement