
నిలకడగా గోదావరి
ధవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చి నాలుగు రోజులుగా పరవళ్లు తొక్కిన గోదారమ్మ శాంతించింది. శనివారం తెల్లవారుజామున కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7 గంటలకు 11.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 8 గంటలకు 11.50 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుంచి 9,83,312 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13,400 క్యూసెక్కులు వదిలారు. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి మట్టాలు మరింత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదివారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది.