
భారీగా నల్ల బెల్లం స్వాధీనం
● ఇద్దరిపై కేసు నమోదు
● వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ప్రత్తిపాడు: అక్రమంగా వ్యాన్‌లో తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్లబెల్లాన్ని జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద గురువారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి వివరాల మేరకు, ఏలేశ్వరం మండలం యర్రవరం వద్ద జాతీయ రహదారిపై ఎకై ్సజ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి నల్లబెల్లం లోడుతో యర్రవరం వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా నల్లబెల్లం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మనం నాగరాజును అరెస్టు చేసి, వ్యాన్‌తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి శిలపరశెట్టి వెంకటరమణ అలియాస్ వెంకన్నబాబుపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్, ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్, సిబ్బంది పాల్గొన్నారు.