
తొలగిస్తేనే రైతులకు మేలు
ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, ఇతర ఉద్యాన ఉత్పత్తులపై జీఎస్టీ మొత్తం ఎత్తి వేయాలి. దీనివల్ల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదే జరిగితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమల లేనిలోటు కొంత వరకూ తీరి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గతంలో ఎండు కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించడం ద్వారా జీఎస్టీని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.
– మత్యాల జమ్మి, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సభ్యుడు, అంబాజీపేట