ఉండవల్లిని కలసిన వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు | - | Sakshi
Sakshi News home page

ఉండవల్లిని కలసిన వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యేలు

Aug 19 2025 4:44 AM | Updated on Aug 19 2025 4:44 AM

ఉండవల

ఉండవల్లిని కలసిన వైఎస్సార్‌ సీపీ మాజీ

రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ను ఆయన నివాసంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నగరానికి వచ్చిన వారు దానవాయిపేటలోని మాజీ ఎంపీ ఉండవల్లి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. వారి వెంట మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ ఉన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు

25 ఫిర్యాదులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టం (పీజీఆర్‌ఎస్‌)కు 25 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ డి.నరసింహకిశోర్‌ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి సమస్యలకు సంబంధించి వివరాలు అడిగారు. ఫిర్యా దుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశాలిచ్చా రు. నిర్దేశించిన సమయంలో అర్జీల పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సివిల్‌ కేసు లు, కుటుంబ సమస్యలు, చీటింగ్‌, కొట్లాట, దొంగతనం కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.

భక్తులతో రత్నగిరి కిటకిట

అన్నవరం: సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన నవ దంపతులు, భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ముహూర్తాలలో రత్నగిరిపై సుమారు 50 వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో వారంతా తమ బంధువులతో కలిసి సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని, 2,200 వ్రతాలు జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు.

సారా రహిత

జిల్లాగా తీర్చిదిద్దాలి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): సెప్టెంబర్‌ నెలాఖరు నాటికి తూర్పుగోదావరి జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వై.చైతన్యమురళి అధికారులను ఆదేశించారు. సోమవా రం ఆయన జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శించి నవదో యం 2.0పై అధికారులకు పలు సూచనలు చేశా రు. రాజమహేంద్రవరం సౌత్‌, నార్త్‌, కోరుకొండ స్టేషన్ల పరిధిలో సారాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది సిబ్బందిని స్పెషల్‌ టీమ్‌గా తీసుకు వచ్చామన్నారు. వీరు బృందాలుగా ఏర్పడి సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో సారా తయారీ, అమ్మకాలపై దాడులు నిర్వహిస్తారన్నారు. బార్‌ పాలసీ విధానంలో ఎక్కువ మంది పాల్గొనేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి చింతాడ లావణ్య, ఏఈఎస్‌ పి.నాగరాహుల్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పులి హనుశ్రీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికిరణ్‌, సౌత్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐడీ నాగేశ్వరరావు, కోరుకొండ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస బాలాజీ పాల్గొన్నారు.

ఉండవల్లిని కలసిన                  వైఎస్సార్‌ సీపీ మాజీ 1
1/2

ఉండవల్లిని కలసిన వైఎస్సార్‌ సీపీ మాజీ

ఉండవల్లిని కలసిన                  వైఎస్సార్‌ సీపీ మాజీ 2
2/2

ఉండవల్లిని కలసిన వైఎస్సార్‌ సీపీ మాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement