
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
పెదపూడి: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడకు చెందిన వ్యాపారవేత్త మల్లిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జి.మామిడాడ లలిత నగర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వ్యాపారవేత్తలు మల్లిడి శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ల రామచంద్రారెడ్డి, సబ్బెళ్ల లక్ష్మణరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న వారు సెప్టెంబర్‌లో అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికలకు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీడీ నల్లమిల్లి అప్పారెడ్డి, పీఈటీ జె.మోహన్ వ్యవరించారు. కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ముప్పన వీర్రాజు, అధ్యక్షుడు ముప్పన వీరభద్రస్వామి, కార్యదర్శి సీతాపతిరావు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్‌అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సూరిబాబు పాల్గొన్నారు.