
హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
రాజానగరం: దివాన్‌చెరువులోని శ్రీప్రకాష్ విద్యా నికేతన్‌లో సీబీఎస్‌ఈ సౌత్ జోన్–1 హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్‌లు, మేనేజర్లు హాజరవుతున్నట్టు కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. తొలి రోజు పోటీల్లో శ్రీకృష్ణ ఇంటర్నేషనల్ స్కూల్ (చైన్నె), ది నంద్యాల పబ్లిక్ స్కూల్ (నంద్యాల), శ్రీప్రకాష్ విద్యా నికేతన్ (దివాన్‌చెరువు), కవి భారతి విద్యాలయం (చైన్నె) విజయం సాధించాయని స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి తెలిపారు. కార్యక్రమంలో రివర్‌బే మూర్తి, టెక్నికల్ ఇన్‌చార్జి ఎస్.గోపీకృష్ణ, ప్రిన్సిపాల్ విమల, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.