
హెచ్‌ఐవీ పరీక్షల శాతాన్ని పెంచాలి
అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ భరతలక్ష్మి
అమలాపురం టౌన్: ఏఆర్‌టీ కౌన్సిలర్లు హెచ్‌ఐవీ పరీక్షల శాతాన్ని పెంచాలని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి అన్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ వ్యాప్తి చెందకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏఆర్‌టీ కౌన్సిలర్లకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుని నుంచి నలుగురు భాగస్వాములను గుర్తించి, వారికి పరీక్షలు చేయాలని, వేరొకరికి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఐ.ప్రభాకరావు, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ గంటల ఆదిలింగం తదితరులు పాల్గొన్నారు.