
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ముగిసిన అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
తుని రూరల్: ప్రతిభ చూపే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో మూడు రోజుల పాటు జరిగిన సీబీఎస్‌ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్ర అండర్–14, 17, 19 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 180కి పైగా జట్లకు చెందిన రెండు వేల మంది పోటీల్లో పాల్గొన్నారు. మూడు విభాగాల్లో 12 జట్లు విజేతలుగా నిలిచాయి. విజేత జట్లకు మెడల్స్, జ్ఞాపికలు అందించారు. సీబీఎస్‌ఈ పరిశీలకుడు సీహెచ్‌ఎల్‌ఎం శ్రీనివాసు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, వివిధ ప్రాంతాలకు చెందిన కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు.
ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలు
అండర్–19 బాలికల విభాగంలో సిస్టర్స్ నివేదిత స్కూల్(హైదరాబాద్), వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అలాగే బాలురు విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, ఫార్‌ూచ్యన్ బటర్‌ఫ్‌లై(మహబూబ్‌నగర్), అండర్–17 బాలికల విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పాయకరావుపేట), మాంటిస్సోరి ఎలైట్ (అనంతపురం), బాలురు విభాగంలో శ్రీప్రకాష్, ఎకార్డ్ స్కూల్(తిరుపతి), అండర్–14 బాలికల విభాగంలో హీల్ స్కూల్ (నరిసింగపాలెం), సూర్య అకాడమీ(హైదరాబాద్), బాలుర విభాగంలో శ్రీప్రకాష్, ఏకశిల ఇంటర్నేషన్(మహబూబ్‌నగర్) విజేతలుగా నిలిచారు.

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు

క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు