వివాహేతర సంబంధమే కారణం! చివరికి.. | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధమే కారణం! చివరికి..

Dec 29 2023 3:52 AM | Updated on Dec 29 2023 8:04 AM

- - Sakshi

తూర్పుగోదావరి: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జొన్నకూటి గౌతంనాయుడును వీసీ ఆచార్య కె.పద్మరాజు సస్పెండ్‌ చేశారు. యూనివర్సిటీలోనే పనిచేస్తున్న ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అతనిని అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో రెగ్యులర్‌ ఉద్యోగి అయిన అతనిని బుధవారం సస్పెండ్‌ చేశారు.

సైన్స్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంనాయుడు ఏడాది క్రితం వరకు ఎగ్జామ్స్‌ విభాగంలో పనిచేసేవాడు. యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేసే స్వీపర్స్‌ ఉదయాన్నే 8 గంటలకు వచ్చి, గదులను తుడుస్తుంటారు. ఆ విధంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వివాహిత అయిన స్వీపర్‌పై కన్నేసిన గౌతంనాయుడు ఒకరోజు ఉదయం 8 గంటలకే చేరుకున్నాడు.

ఆమె లోనికి వచ్చి గదిని తుడుస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి తలుపులు వేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను రెగ్యులర్‌ ఉద్యోగినని, అరచినా, ఎవరికైనా చెప్పినా నీ ఉద్యోగమే పోతుందని బెదిరించాడు. ఆ బెదిరింపులకు తలొంచిన ఆమెతో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 5న ఆరోగ్యం బాగోలేదని ఆమె విధులకు రాలేదు.

దీంతో లాలాచెరువులో ఉండే ఆమె ఇంటికే నేరుగా వెళ్లి, తన ఆరోగ్యం బాగోలేదని వారిస్తున్నా వినకుండా మరోసారి ఆమైపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనలపై ఆమె తన భర్త సహకారంతో నవంబర్‌ 27న రాజానగరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. రాజానగరం పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఈనెల 17న తాడేపల్లిగూడెంలో అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. దీంతో అతనిని సస్పెండ్‌ చేశారు. కాగా ఈ విషయమై వీసీ ఆచార్య కె. పద్మరాజును వివరణ కోరగా సస్పెండ్‌ చేసిన మాట వాస్తవమేనన్నారు.

ఇవి చదవండి: కీచక టీచర్‌.. విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement