కీచక టీచర్‌.. విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు | Visakha Special Pocso Court Sensational Verdict In Case Of Assault On Girl | Sakshi
Sakshi News home page

కీచక టీచర్‌.. విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు

Dec 28 2023 5:37 PM | Updated on Dec 28 2023 6:17 PM

Visakha Special Pocso Court Sensational Verdict In Case Of Assault On Girl - Sakshi

విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పవిత్రమైన ఉపాధ్యాయుడి స్థానంలో ఉండి.. పదో తరగతి చదువుతున్న బాలికపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన జనకేశ్వరరావుకి 25 ఏళ్లు జైలు శిక్షతో పాటు, 50 వేల రూపాయలు జరిమానాను కోర్టు విధించింది.

విశాఖలోని నాలుగోవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 ఏడాదిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి ఆధారాలతో కేసును పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలికి 4 లక్షల 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు తీర్పు చెప్పింది.  బాధితులకు న్యాయం జరిగేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పీపీ కరణం కృష్ణకి బాధితులు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండి: సినిమా స్టోరీలా.. పరువు హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement