breaking news
AN university
-
వివాహేతర సంబంధమే కారణం! చివరికి..
తూర్పుగోదావరి: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జొన్నకూటి గౌతంనాయుడును వీసీ ఆచార్య కె.పద్మరాజు సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలోనే పనిచేస్తున్న ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అతనిని అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో రెగ్యులర్ ఉద్యోగి అయిన అతనిని బుధవారం సస్పెండ్ చేశారు. సైన్స్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంనాయుడు ఏడాది క్రితం వరకు ఎగ్జామ్స్ విభాగంలో పనిచేసేవాడు. యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే స్వీపర్స్ ఉదయాన్నే 8 గంటలకు వచ్చి, గదులను తుడుస్తుంటారు. ఆ విధంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వివాహిత అయిన స్వీపర్‌పై కన్నేసిన గౌతంనాయుడు ఒకరోజు ఉదయం 8 గంటలకే చేరుకున్నాడు. ఆమె లోనికి వచ్చి గదిని తుడుస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి తలుపులు వేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను రెగ్యులర్ ఉద్యోగినని, అరచినా, ఎవరికైనా చెప్పినా నీ ఉద్యోగమే పోతుందని బెదిరించాడు. ఆ బెదిరింపులకు తలొంచిన ఆమెతో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న ఆరోగ్యం బాగోలేదని ఆమె విధులకు రాలేదు. దీంతో లాలాచెరువులో ఉండే ఆమె ఇంటికే నేరుగా వెళ్లి, తన ఆరోగ్యం బాగోలేదని వారిస్తున్నా వినకుండా మరోసారి ఆమైపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనలపై ఆమె తన భర్త సహకారంతో నవంబర్ 27న రాజానగరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. రాజానగరం పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఈనెల 17న తాడేపల్లిగూడెంలో అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. కాగా ఈ విషయమై వీసీ ఆచార్య కె. పద్మరాజును వివరణ కోరగా సస్పెండ్ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఇవి చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ఇంచార్జి వైస్ ఛాన్స్లర్ గా ఏపీ సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ బి. ఉదయలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉదయలక్ష్మిని ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. -
ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి
హైదరాబాద్: ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో.. కొత్తగా.. సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉదయలక్ష్మికి ఉత్తర్వులు జారీ చేసింది.