ఒంటరి మహిళపై సామూహిక లైంగిక దాడి | widow Gang Raped By Six Men In Rewa | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో దారుణం

Oct 6 2020 7:00 PM | Updated on Oct 6 2020 7:41 PM

widow Gang Raped By Six Men In Rewa - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని రెవా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 36 సంవత్సరాల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అక్టోబర్‌ 1న ఈ ఘటన జరగ్గా, బాధిత మహిళ స్ప్రహ కోల్పోవడంతో నిందితుడు ఆమెను సంజయ్‌ గాంధీ మెడికల్‌ కాలేజ్‌కు తీసుకువెళ్లాడు. ఆస్పత్రిలో కోలుకుంటున్న మహిళ పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చే పరిస్ధితిలో లేరని వైద్యులు తెలిపారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తల్లి ఆదివారం ఈ ఘటనపై తనకు చెప్పారని బాధిత మహిళ చెప్పారు. భర్తను కోల్పోయిన బాధిత మహిళ వంటలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

అంత​కుముందు బాధిత మహిళ అదృశ్యంపై కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఆపై ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సంజయ్‌ గాంధీ మెడికల్‌ కాలేజ్‌ నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందింది. మహిళ స్ప్రహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలిచించిన నిందితులు అనంతరం పరారయ్యారని పోలీసులు చెప్పారు. తన తల్లి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత మహిళ కుమారుడు ఆరోపించారు. నిందితుల్లో నలుగురిని అరెస్ట్‌ చేశామని, మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నామని మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి ఆరాధనా సింగ్‌ పరివార్‌ చెప్పారు. చదవండి : యువతిపై డెలివరీ బాయ్స్‌ అకృత్యం

Advertisement
 
Advertisement
Advertisement