రైల్వేస్టేషన్లలో లేడీ కిలాడీ గ్యాంగ్‌.. ఒక్కో స్టేషన్‌లో ఒక్కో పేరుతో ప్రత్యక్షం | Tirupati: Women Gang Thieves In Railway Stations | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లలో లేడీ కిలాడీ గ్యాంగ్‌.. ఒక్కో స్టేషన్‌లో ఒక్కో పేరుతో ప్రత్యక్షం

Jul 16 2023 8:09 AM | Updated on Jul 16 2023 8:09 AM

Tirupati: Women Gang Thieves In Railway Stations - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే స్టేషన్లను టార్గెట్‌ చేసుకుని.. ప్రయాణికుల జేబులను కొల్లగొట్టడమే వృత్తిగా జీవనం సాగిస్తున్న ముగ్గురు లేడీ కిలాడీలను తిరుపతి రైల్వే స్టేషన్‌లో శనివారం పోలీసులు అరెస్టు చేసి 3 సెల్‌ఫోన్లతోపాటు రూ.34,500 స్వాదీనం చేసుకున్నారు.

తిరుపతి అర్బన్‌: రైల్వే స్టేషన్లను టార్గెట్‌ చేసుకుని.. ప్రయాణికుల జేబులను కొల్లగొట్టడమే వృత్తిగా జీవనం సాగిస్తున్న ముగ్గురు లేడీ కిలాడీలను తిరుపతి రైల్వే స్టేషన్‌లో శనివారం పోలీసులు అరెస్టు చేసి 3 సెల్‌ఫోన్లతోపాటు రూ.34,500 స్వాదీనం చేసుకున్నారు.

తమిళనాడులోని తుతుకుడి జిల్లాకు చెందిన ఎం.మీనా (23), ఎస్‌.రాణి (29), ఏ అంజలి (25) రైల్వే స్టేషన్లను టార్గెట్‌ చేస్తూ ఒక్కో రైల్వే స్టేషన్‌లో తిష్ట వేసి చోరీలు చేస్తారు. తర్వాత మరో రైల్వే స్టేషన్‌కు వెళ్లి మారు పేర్లతో ఇదే తంతు కొనసాగిస్తారు.

వారి భర్తలు వీరున్న సమీపంలోనే కూలి పనులు చేస్తుంటారు. ఇదే సమయంలో వీరు  చోరీ లకు పాల్పడుతుంటారు.  ముగ్గురిపై రైల్వే పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు.
చదవండి: వాళ్ళది వివాహేతర సంబంధం కాదు: మనోజ్ తండ్రి

Advertisement
 
Advertisement
Advertisement