Tamil Nadu: Newly Married Bride Groom Ends His Life - Sakshi
Sakshi News home page

నెల క్రితం పెళ్లి.. శ్మశానవాటికి సమీపంలోకి వెళ్లి

Aug 15 2023 1:34 PM | Updated on Aug 15 2023 2:59 PM

Tamil Nadu: Newly Married Bride Groom Ends His Life - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అన్నానగర్‌(చెన్నై): తిరువారూర్‌ జిల్లా ముత్తుప్పేట సమీపంలోని కోవిలూరు శ్మశాన వాటిక సమీపంలో సోమవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకుని యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రజలు ముత్తుపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరుతురపూండి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పోలీసులు జరిపిన విచారణలో అతను ముత్తుపేట సమీపంలోని కోవిలూరు ఉత్తర అటవీ ప్రాంతానికి చెందిన మణికంఠన్‌ కుమారుడు సంతోష్‌ (20) అని తేలింది. మంగళూరుకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. పెళ్లికి నిరాకరించడంతో యువతి ముత్తుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి రాజీ చేసి నెల క్రితం పెళ్లి చేశారు. ఈ క్రమంలో అతను సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement