రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి | Singareni Employee Satyanarayana In Ramagundam Open Cast | Sakshi
Sakshi News home page

రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి

Dec 3 2024 3:31 PM | Updated on Dec 3 2024 4:22 PM

Singareni Employee Satyanarayana In Ramagundam Open Cast

సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌.

వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్‌ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్‌లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.

మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement