HYD: సూరారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ప్రయాణికులకు గాయాలు | Rtc Bus Accident In ​Hyderabad Suraram | Sakshi
Sakshi News home page

HYD: సూరారంలో డివైడర్‌ను ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

Jul 7 2024 7:33 PM | Updated on Jul 7 2024 7:45 PM

Rtc Bus Accident In ​Hyderabad Suraram

సాక్షి,హైదరాబాద్‌: నగరంలోని సూరారంలో ఆదివారం​(జులై 7) సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు మండిపడ్డారు. ఈ ఘటనతో బహదూర్‌పల్లి చౌరస్తా నుంచి సూరారం వరకు ట్రాఫిక్‌జామ్‌ అయింది.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. జీడిమెట్ల డిపో బస్సు గండి మైసమ్మ నుంచి సికింద్రాబాద్‌ వెళుతుండగా ప్రమాదం జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement