ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవదహనం | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఒకరు సజీవదహనం

Published Mon, Dec 4 2023 8:16 AM

Private Travels Bus Short Circuited In Nalgonda - Sakshi

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే సజీవదహనం కాగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి చీరాల వెళుతుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంటల ధాటికి బస్సులోనే ప్రయాణికుల వస్తువులు తగలబడిపోయాయి. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందినదిగా బస్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉ‍న్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement