ప్రత్యర్థుల కత్తుల వేట, ఒకరు మృతి | One Died In Rivals Attacked With Lethal Weapons At Sangareddy | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థుల కత్తుల వేట, ఒకరు మృతి

Jan 5 2021 8:24 PM | Updated on Jan 5 2021 8:53 PM

One Died In Rivals Attacked With Lethal Weapons At Sangareddy - Sakshi

మృతుడు కరుణాకర్‌, గాయాలపాలైన దేవయ్య

సాక్షి, సంగారెడ్డి: భూవివాదం నేపథ్యంలో ఇరువర్గాలు కత్తులు, గొడ్డళ్లతో దాడులు చేసుకోవడంతో ఓ నిండు ప్రాణం బలైన ఘటన చౌటకూర్‌ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా గ్రామానికి చెందిన బేగరి దేవయ్య, కాశగారి ప్రదీప్‌ మధ్య భూతగాదాలున్నాయి. ఈక్రమంలో మంగళవారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దేవయ్య, ఆయన కొడుకు కరుణాకర్‌పై ప్రత్యర్థివర్గానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.. కరుణాకర్‌ ప్రాణాలు విడువగా దేవయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరూ రక్తపు మడుగులో ఉన్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్రంగా గాయపడ్డ దేవయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దేవయ్య ఎస్సీ కార్పొరేషన్లో ఏడీగా పనిచేస్తున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement