HYD: కిడ్నాప్‌నకు గురైన పాప సేఫ్‌..  | Nine Months Baby Kidnap And Safe At Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: కిడ్నాప్‌నకు గురైన పాప సేఫ్‌.. 

Mar 3 2024 8:20 AM | Updated on Mar 3 2024 8:54 AM

Nine Months Baby Kidnap And Safe At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ మాదన్నపేటలో కిడ్నాప్‌నకు గురైన తొమ్మిది నెలల పాప సురక్షితమని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేసిన మహిళ ఎంజీబీఎస్‌లో జహీరాబాద్‌లో బస్సు ఎక్కినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ బస్సు దిగిన వెంటనే మహిళను అదుపులోకి తీసుకుని పాపను రక్షించారు.

వివరాల ప్రకారం.. పాతబస్తీలోని మాదన్నపేటలో పాపను కిడ్నాప్‌ చేశారు. ఓ మహిళ పాపను కిడ్నాప్‌ చేసి చంచల్ గూడ నుండి ఎంజీబీఎస్‌వైపు వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. అనంతరం.. జహీరాబాద్‌ వెళ్లే బస్సు ఎక్కినట్టు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. అయితే, కిడ్నాప్‌ చేసిన మహిళను సహనాజ్‌ఖాన్‌గా గుర్తించారు.  బాధితుల ఇంట్లో ఆమె రెండు నెలల క్రితమే పని మనిషిగా చేరినట్టు తెలుస్తోంది. 

జహీరాబాద్ పోలీసులను మాదన్నపేట్ పోలీసులు అప్రమత్తం చేశారు. కిడ్నాపర్‌ మహిళ జహీరాబాద్‌లో బస్సు దిగిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని చిన్నారిని క్షేమంగా కాపాడారు. కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చిన్నారి కుటుంబ సభ్యులు, మాదన్నపేట్ పోలీసులు చేరుకున్నారు. అనంతరం పాపను పేరెంట్స్‌కు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement