ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టిన 'డ్రెస్‌'! | Mumbai: Clothes divide two friends, then what happened next? | Sakshi
Sakshi News home page

అడక్కుండానే తన డ్రస్‌ వేసుకుంటున్నాడని..

Sep 12 2026 2:45 PM | Updated on Sep 12 2026 2:48 PM

Mumbai: Clothes divide two friends, then what happened next?

ముంబై: ఇతరుల డ్రెస్‌ వేసుకోవడం, వారి వస్తువులను వాడుకోవడమంటే కొందరికి చెడ్డ చిరాకు. అలాగే, చెప్పకుండానే ఇతరులు తమ డ్రెస్‌ను వేసుకోవడాన్ని, వస్తువులు వాడుకోవడాన్ని ఏమాత్రం సహించలేరు. ముంబైలోని గోరెగావ్‌ ప్రాంతంలో సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చుపెట్టింది. ఆగ్రహంతో కొట్లాడుకున్నారు. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

సూరజ్‌ శంకర్‌ ధోలె(26), బాబా సాహెబ్‌ అలియాస్‌ సుబోధ్‌ భీమ్‌రావ్‌ వాంఘ్మారేలు గోరెగావ్‌లోని ఓ పెట్‌ కేర్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు. అయితే, ధోలె తరచుగా వాంఘ్మారే డ్రెస్‌లు వేసుకోవడం, అతడి వస్తువులను వాడుకోవడం చేస్తున్నాడు. ఇది వాంఘ్మారేకు ఏమాత్రం నచ్చడం లేదు.

తన అనుమతి లేకుండానే ధోలె ఇలా చేయడంపై వాంఘ్మారేకు కోపంగా ఉంది. దీనిపై శుక్రవారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో వాంఘ్మారే చేతిలో ధోలె ప్రాణాలు కోల్పోయాడు. ధోలె తండ్రి శంకర్‌ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసిన పోలీసులు..పరారీలో ఉన్న వాంఘ్మారే కోసం గాలింపు చేపట్టారు.

ఇదీ చ‌ద‌వండి: గుజ‌రాత్‌కు ఎందుకు త‌ర‌లించారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement