ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’! | Man Who is In Karnataka Kidnapped Girl Dies In Encounter | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల బాలికపై హత్యాచార నిందితుడు ‘ఎన్ కౌంటర్’!

Apr 13 2025 10:22 PM | Updated on Apr 13 2025 10:25 PM

 Man Who is In Karnataka Kidnapped Girl Dies In Encounter

బెంగళూరు:  ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయినట్లు తెలుస్తోంది.  నిందితుడ్ని పట్టుకునే క‍్రమంలో తప్పించుకోబోయిన 35 ఏళ్ల నితీష్ కుమార్.. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడు.  ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.

‘మేము నిందితుడి నితీష్ కుమార్ ను పట్టుకున్న తర్వాత మాపై దాడి చేశాడు. ఈ క్రమంలోనే పారి\పోయే యత్నం చేశాడు. దీనిలో భాగంగా మేము ఓ హెచ్చరిక జారీ చేస్తూ ‘వార్నింగ్ షాట్( అతనిపై కాల్చాం. అయినా తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. మేము కేసు రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా అతని ఊరికి తీసుకెళ్లాం. అక్కడ మా టీమ్ పై దాడికి పాల్పడ్డాడు. హుబ్బాల్లి పోలీస్ అధికారి శశి కుమార్ మీడియాకు వెల్లడించారు.

తప్పించుకునే క్రమంలో తమ వాహనాలను కూడా అతడు ధ్వంసం చేశాడని, ఈ క్రమంలో తమ టీమ్ లోని ఒక పోలీస్ అధికారి గాల్లోకి కాల్పులు జరపాడన్నారు. అయినా కూడా తప్పించుకునేందుకు యత్నించడంతో అతనిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఆపై వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే యత్నం చేశామని, కానీ డాక్టర్లు అతను చనిపోయినట్లు ధృవీకరించారని సదరు పోలీస్ అధికారి వెల్లడించారు.

కన్నేసి.. కిడ్నాప్‌ చేసి హత్యాచారం
ఇటీవల  కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్ కు గురి కావడమే కాకుండా ఆపై అత్యాచారం, హత్య గావించబడింది. ఇళ్లలో పని చేసుకునే ఓ మహిళ కూతుర్ని నితీష్ కుమార్ అనే వ్యక్తి హత్యాచారం చేశాడు. తల్లి పనిలో వెళ్లడాన్ని గమనించిన అతను.. పాపను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఆ పాపను హత్య చేశాడు. ఈ విషయం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకుని కస్టడీకి తీసుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసేందుకు అతని ఊరికి తీసుకెళ్లగా, పోలీసుల్ని ఎదురించి దాడికి యత్నించాడు.  దాంతో పోలీసులు జరిగిపన కాల్పుల్లో నితీష్ కుమార్ మరణించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement