తునిలో ఎన్నారై సురేశ్‌ మృతి కలకలం.. భార్యే..! | Man Deceased By His Wife In East Godavari District | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే..?!

Nov 8 2020 5:55 PM | Updated on Nov 9 2020 6:06 AM

Man Deceased By His Wife In East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: తునిలో ఓ ఎన్నారై అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యే భర్తను హత్య చేసిందని ఎన్నారై సురేశ్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఒడిశా రాష్ట్రం పెంటకోట గ్రామానికి చెందిన వంకా సురేశ్‌.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ప్రమీలను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. సురేశ్‌ జపాన్‌లో ఉద్యోగం చేస్తుండగా.. కరోనా కారణంగా ఇండియాకు తిరిగొచ్చి గత నాలుగు నెలలుగా భార్యతో కలిసి తునిలో ఉంటున్నాడు. అయితే ఈ మధ్యనే సురేశ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందాడని సురేశ్‌ భార్య అతడి తల్లిదండ్రులకు తెలియజేయడంతో అంత్యక్రియలు పూర్తి చేశారు.  (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌)

అయితే అంత్యక్రియలు ముగిసిన రెండు రోజుల తర్వాత కుటుంబ సభ్యులు అంత్రక్రియలకు సంబంధించిన ఫొటోలలో కొన్ని గాయాలు గుర్తించారు. గాయాలు చూసి సురేశ్‌ కుటుంబ సభ్యులు తుని పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సురేశ్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందుకే తన తమ్ముడిని చంపేసిందని సురేశ్‌ సోదరుడు ఆరోపించాడు. హత్యకు అత్తామామలు కూడా సహకరించారని సురేశ్‌ సోదరుడు వంకా జగన్నాథం ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే సురేశ్‌ భార్యే తమ కుమారుడని హత్యచేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  దీంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement