పిల్లలున్నా అతడితో లవ్‌ ట్రాక్‌.. చివరకు.. | Maharashtra: Man Kills Live-In Partner After She Accuses Him Of Rape, Wife Helps Dispose Body - Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో నయ వంచన.. అవసరం తీరాక.. 

Sep 13 2023 12:39 PM | Updated on Sep 13 2023 1:15 PM

Live-In Partner Naina Mahat Muredered In Maharashtra Palghar - Sakshi

ఇటీవలి కాలంలో లివింగ్‌ పార్ట్‌నర్స్‌ దారుణ హత్యకు గురవుతున్న వార్తలు చాలానే చూశాం. ఢిల్లీ శ్రద్దావాకర్‌ హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం, దేశంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్‌ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఆమెను వంచించి.. చివరకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం, ఆమె డెడ్‌బాడీని సూటుకేసులో పెట్టి బయటపడేశాడు. 

ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన సినీ మేకప్‌ ఆర్టిస్‌ నైనా మహత్‌(29)కు మనోహర్‌ శుక్లా(43)తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏ‍ర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో శారీరకంగా కూడా వీరద్దరూ దగ్గరయ్యారు. అయితే, మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా క్రమంగా అతనికి దగ్గరైంది. ఇక అప్పటి నుంచి ఇద్దరూ తమ ప్రేమాయణం కొనసాగించారు. వీరి వ్యవహరం ఇరువురు కుటుంబాల సభ్యులకు తెలియడంతో ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వీరు.. తన బంధాన్ని కొనసాగించారు. 

నైనా ఫోన్‌ ఆఫ్‌..
ఇదిలా కొనసాగుతున్న క్రమంలో.. నైనా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడం ఆమె కుటుంబ సభ్యులను కలవరపాటుకు గురిచేసింది. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు కాల్‌ చేసినా ఆఫ్‌ రావడంతో నైనా కుటుంబ సభ్యులు ఆగస్టు 12వ తేదీన పోలీసులను ఆశ్రయించారు. నైనా ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైనా ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడే ఉన్న సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య సూట్‌కేసుతో బయలుదేరడాన్ని గుర్తించారు.

గుజరాత్‌ సరిహద్దుల్లో డెడ్‌బాడీ..
ఇక, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నైనా లవర్‌ శుక్లాని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెల్లడించాడు. నైనాతో తన సంబంధం గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి ఆమెకు బ్రేకప్‌ చెప్పినట్టు తెలిపాడు. కానీ.. ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువచ్చిందన్నాడు. తనను పెళ్లిచేసుకోకపోతే శుక్లాపై అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన టార్చర్ భరించలేకనే నైనాను చంపేసిన్నట్టు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం, నైనా డెడ్‌బాడీ ఉన్న సూట్‌కేసును పోలీసులు గుజరాత్‌ బోర్డర్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

ఇది కూడా చదవండి: ప్రియుడు మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement