Karnataka: Police Raids House In Brundavan Nagar Busted Prostitution Racket - Sakshi
Sakshi News home page

Prostitution Racket Busted: వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని

Jul 18 2023 1:08 PM | Updated on Jul 18 2023 1:41 PM

Karnataka: Police Raid House, Busted Prostitution Racket - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్‌కాట్‌ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్‌ నగర్‌ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్‌ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరో ఘటనలో..

గుట్కా, కారు సీజ్‌
హోసూరు: కర్ణాటక నుంచి కరూర్‌కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్‌కాట్‌ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. సిఫ్‌కాట్‌ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్‌పోస్ట్‌ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్‌ (28) అనే డ్రైవర్‌ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు.

చదవండి  హైదరాబాద్‌: మీర్‌పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి..

Advertisement
 
Advertisement
Advertisement