Brawl For Beer Bottle Kills Man In Meerpet's Jillelguda - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: మీర్‌పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి..

Jul 18 2023 10:09 AM | Updated on Jul 18 2023 10:31 AM

Brawl For Beer Bottles Kills Man in Meerpet Jillelguda - Sakshi

బీరు బాటిల్స్‌ కొనుక్కుని వెళ్తున్న సాయిని అడ్డుకుని.. 

సాక్షి, క్రైమ్‌: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ శివారు మీర్‌పేట పరిధిలో దారుణం జరిగింది. బీర్ బాటిల్స్‌ కోసం ఓ వ్యక్తితో గొడవ పెట్టుకుని.. అతన్ని కత్తితో కిరాతకంగా హత్య చేశారు. మృతుడ్ని సాయి వరప్రసాద్‌గా నిర్ధారించారు పోలీసులు. 

జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్‌.. బీరు బాటిల్స్‌ కొనుక్కుని వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు.. అతన్ని అడ్డుకుని బాటిల్స్‌ తమకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. అందుకు అతను ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు.

బీర్‌ బాటిల్‌ హత్య  ఉదంతంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మీర్ పేట్ పోలీసులు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్,సంతోష్ యాదవ్,పవన్‌లను నిందితులుగా నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement