
సీసాపై లేబుల్ ఒకటి.. పానీయం మరొకటా?
మద్యం షాపు సిబ్బందిపై వ్యక్తి ఆగ్రహం
కృష్ణా జిల్లా: కొనుగోలు చేసిన బీరు సీసాపై లేబుల్ ఒక కంపెనీది ఉంటే.. అందులో పానీయం మరో కంపెనీది ఉందంటూ మందుబాబులు గొడవకు దిగిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని ఓ వైన్‌షాపులో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేశాడు. కొంత బీరు తాగాక ఆతనికి అనుమానం కలిగింది. సీసాపై ఉన్న కంపెనీ లేబుల్‌కు, అందులోని మందుకు పొంతన లేకపోవడంతో వైన్‌షాపు సిబ్బందిని గట్టిగా నిలదీశాడు.
ఒక కంపెనీ స్టిక్కర్ ఉన్న బాటిల్‌లో మరో కంపెనీ బీరు విక్రయించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై షాపు సిబ్బందికి, సదరు వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికి ఎక్సైజ్ సిబ్బంది, వైన్‌షాపు యజమాని అక్కడికి చేరుకుని బీరు కొనుగోలు చేసిన వ్యక్తితో మాట్లాడారు. ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాంది