Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్‌ | Sakshi
Sakshi News home page

Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్‌

Published Sun, May 26 2024 1:00 PM

Viral Video: Rival Groups Clash With Cars In Karnataka's Udupi

యశవంతపుర: యువకునిపై కారు ఎక్కించి, తల్వార్లతో దాడి చేసిన ఘటన ఉడుపిలో జరిగింది. శుక్రవారం రాత్రి ఉడుపి శారద మండపం జంక్షన్‌లో రెండు గుంపుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. హైవే – 169లో ప్రజలు తిరుగుతున్న సమయంలో దుండగులు పెద్ద పెద్ద కత్తులతో వీరవిహారం చేశారు. సినిమాలో మాదిరిగా కార్లలో ఒకరినొకరు గుద్దుకుంటూ గొడవలు పడడం చూసి జనం భయాందోళనకు గురయ్యారు. 

దగ్గర్లో అపార్ట్‌మెంట్‌లోని ఒక వ్యక్తి ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ వీడియో చూసి ఇది ఉడుపియేనా, లేక ఇతర దేశమా? అని స్థానిక ప్రజలే నోటిమీద వేలు వేసుకొంటున్నారు. కాపు తాలూకాకు చెందిన గరుడ గ్యాంగ్‌ యువకులు ఒక కారు అమ్మకంపై మరో గుంపుతో గొడవ పడినట్లు తెలిసింది. ఈ దాడుల్లో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement