గే యాప్‌లో పరిచయం.. నగ్నచిత్రాలు తీసి బెదిరింపులు  | Hyderabad: Harassment Via Gay Dating App in Banjara Hills | Sakshi
Sakshi News home page

Hyderabad: గే యాప్‌లో పరిచయం.. నగ్నచిత్రాలు తీసి బెదిరింపులు 

Aug 6 2023 8:20 AM | Updated on Aug 6 2023 8:24 AM

Hyderabad: Harassment Via Gay Dating App in Banjara Hills - Sakshi

నిందితులు అఫ్రిది,  హరూన్‌  

సాక్షి, బంజారాహిల్స్‌: గే యాప్‌లో పరిచయం చేసుకొని వారిని తన గదికి రప్పించి నగ్నదృశ్యాలు చిత్రించి బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటనలో ఓ రౌడీషీటర్‌ను, ఆయన అనుచరుడిని బంజారాహిల్స్‌ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని భోలానగర్‌లో నివసించే అఫ్రిది బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్‌గా నమోదై ఉన్నాడు. ఇతను ఆవారాగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతూ బతుకువెల్లదీస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఈజీమనీకి అలవాటు పడి గే యాప్‌లో యువకులను పరిచయం చేసుకోసాగాడు. వారిని తన గదికి రప్పించి దుస్తులు విప్పించి వీడియోలు తీస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నాడు. మూడు రోజుల క్రితం ఇద్దరు యువకులను ఇదే తరహాలో బెదిరించి నగదు, నగలు దోచుకున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అఫ్రిదీతో పాటు సహకరించిన హరూన్‌ (22) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 
చదవండి: నర్సు వేషంలో ఆస్పత్రిలో చేరి.. ఫ్రెండ్‌ భార్యను..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement