Hyderabad's Amberpet Hit And Run Case Updates - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. అంబర్‌పేటలో వృద్ధురాలు మృతి

Jul 26 2023 1:47 PM | Updated on Jul 26 2023 1:56 PM

Hyderabad Amberpet Hit And Run Case Updates - Sakshi

ఉదయాన్నే చెత్త పడేయడానికి వెళ్లిన ముత్యాలమ్మ పాపం.. 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో హిట్ అండ్‌ రన్ కేసు నమోదు అయ్యింది.  అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు.. వృద్ధురాలు ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.  

అంబర్‌పేట్ నుంచి ఉప్పల్ వెళ్లే రోడ్డులో.. కింగ్ ప్యాలెస్ హోటల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని వినాయక్‌నగర్‌కు చెందిన ముత్యాలమ్మగా పోలీసులు గుర్తించారు. చెత్త పడేయడానికి వెళ్లి ఆమె ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న అంబర్‌పేట పోలీసులు..  సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మొదటి భార్య ఫిర్యాదుతో శవం వెలికితీత

Advertisement
 
Advertisement
Advertisement