కాల్చిన కొడవలితో దాడి  | Husbands attempt to kill his wife | Sakshi
Sakshi News home page

కాల్చిన కొడవలితో దాడి 

Jun 29 2023 3:22 AM | Updated on Jun 29 2023 3:22 AM

Husbands attempt to kill his wife - Sakshi

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొడవలితో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం జరిగింది. కాల్చిన కొడవలితో దాడి చేయడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు నిర్మల(35), మల్లేశ్‌ దంపతుల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.

హమాలీ పనిచేసే మల్లేశ్‌.. వచ్చిన డబ్బులతో మద్యం తాగి రోజూ భార్యను కొడుతున్నాడు. బుధవారం ఉదయం బయటకు వెళ్లి ఇంటికొచ్చిన మల్లేశ్‌.. కొడవలిని కాల్చి పెట్టుకున్నాడు. పిల్లలు పాఠశాలకు వెళ్లగా నిర్మల ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించిన మల్లేశ్‌ కాల్చిన కొడవలితో నిర్మల మెడ వెనుక భాగంలో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు రావడం చూసి మల్లేశ్‌ పరారయ్యాడు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. కొడవలిని కాల్చడంతో శరీరం లోపలి భాగాలకు తీవ్ర గాయాలు అయ్యి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. కొడవలిని మెడ నుంచి తొలగించేందుకు ప్ర యత్నం చేస్తున్నారు. పరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. మల్లేశ్‌.. పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement