కొత్త బట్టలు కొనివ్వాలని కోరిన కూతురు.. కాసేపటికే.. | Sakshi
Sakshi News home page

కొత్త బట్టలు కొనివ్వాలని కోరిన కూతురు.. కాసేపటికే..

Published Fri, Aug 6 2021 9:10 PM

Girl Self Distruction In Adilabad District - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌(ఆదిలాబాద్‌): తల్లిదండ్రులు కొత్త బట్టలు కొనివ్వలేదని బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం అపμపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నికొండే దుర్గయ్య, ఉమాదేవి దంపతులకు కూతురు శిరీష(15), కుమారుడు ఉన్నారు. శిరీష బూర్గుడ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కొత్త బట్టలు కొనివ్వాలని బుధవారం తల్లిదండ్రులను కోరింది. ఈ రోజు వద్దు.. రెండ్రోజుల తర్వాత తీసుకుందామంటూ తల్లి మందలించింది.

తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లిపోగా.. మనస్తాపం చెందిన శిరీష బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి గురువారం మృతిచెందింది. కొత్త బట్టలు కొనిస్తే తన కూతురు బతికుండేదేమోనని తల్లిదండ్రులు రోదించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement