తిరుపతిలో మిస్సింగ్‌ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక? | Girl Missing In Tirupati, Police Suspects That She Had Gone To Hyderabad | Sakshi
Sakshi News home page

తిరుపతిలో మిస్సింగ్‌ కలకలం.. హైదరాబాద్‌కి బాలిక?

Oct 20 2024 11:19 AM | Updated on Oct 20 2024 12:40 PM

Girl Missing In Tirupati

నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైన ఘటన శనివారం చోటుచేసుకుంది.

సాక్షి, తిరుపతి: నగరంలోని కొర్లగుంటలో నివాసం ఉంటున్న ఓ బాలిక అదృశ్యమైంది. ఈస్ట్‌ సీఎస్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. కొర్లగుంట మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు కుమార్తె ఆక్సా క్వీన్‌(14) సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించలేదు. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది.

దీంతో వెంటనే ఈస్ట్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పాప హైదరాబాద్‌కి వెళ్లినట్లుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సెల్‌ ఫోన్‌ అధికంగా వినియోగిస్తూ.. వాటర్‌ డ్రైవర్‌తో మాట్లాడినట్లుగా గుర్తించారు. బాలిక ఆచూకీ లభ్యమైతే 9440348671, 9440796748 నంబరులో సంప్రదించాలని సూచించారు.      

మరో బాలిక..
ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై శనివారం కేసు నమోదు చేసినట్లు ఏర్పేడు సీఐ జయచంద్ర తెలిపారు. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement