ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ | Former Dcp Radhakishan Rao Bail Petition In Telangana High Court | Sakshi
Sakshi News home page

ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. హైకోర్టుకు మాజీ డీసీపీ

Oct 18 2024 7:37 PM | Updated on Oct 18 2024 7:53 PM

Former Dcp Radhakishan Rao Bail Petition In Telangana High Court

సాక్షి,హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ రాధాకిషన్‌రావు హైకోర్టులో శుక్రవారం(అక్టోబర్‌18) బెయిల్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావు అరెస్టయి రిమాండ్‌లో ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావును పంజాగుట్ట పోలీసులు ఏ4గా చేర్చారు. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. 

బెయిల్‌పై తదుపరి విచారణ ఈనెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మరో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. పోలీసులు ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: స్పెల్లింగ్‌ చెబితే.. రేవంత్‌కు రూ.50 లక్షల బ్యాగ్‌ గిఫ్ట్‌ ఇస్తా: కేటీఆర్‌ 

 

 

Advertisement
 
Advertisement
Advertisement