కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా..

Father and son passed away due to family quarrels - Sakshi

తండ్రీకొడుకులు మృతి

కాటేసిన కుటుంబ కలహాలు

గాంధారి(ఎల్లారెడ్డి): కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు కన్నుమూశారు. తండ్రి కత్తితో పొడవడంతో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వెంటనే తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జుల్‌ తండాలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. తండాకు చెందిన బాదావత్‌ వసంత్‌రావు (48) కుమారుడు బాదావత్‌ సురేశ్‌ (27) హైదరాబాద్‌లో ప్రైవే టు ఉద్యోగి. రెండ్రోజుల క్రితం తండాకు వ చ్చాడు.

బుధవారం రాత్రి డబ్బుల విషయంలో తండ్రీ కొడుకులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారు. ఆగ్రహం చెందిన తండ్రి ఇంట్లోని కత్తితో కొడుకు సురేశ్‌ ఎడమ వైపు ఛాతీపై పొడవగా తీవ్రంగా గాయపడ్డాడు. కు టుంబ సభ్యులు, తండావాసులు చికిత్స ని మిత్తం గాంధారి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సురేశ్‌ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

కాగా, ఇంటి వద్ద ఉన్న తండ్రి వసంత్‌ రావు పురుగు మందు తాగా డు. బంధువులు అతడిని నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. తండ్రీ కొడుకును హత్య చేశాడని ఆగ్రహించిన బంధువులు వసంత్‌రావు ఇంటిని ట్రాక్టర్లతో ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రేమ్‌దీప్‌ తెలిపారు.
ఇవి కూడా చ‌ద‌వండి: కారు వేగం ధాటికి.. ఇద్ద‌రు యువ‌కుల విషాదం!
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top