నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రభుత్వ సల హాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్‌రెడ్డి గురువారం మర్యదపూర్వకంగా కలిశారు. నరేందర్‌రెడ్డిని వారు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు.
అగ్ని ప్రమాదంలో
సీజ్డ్ వాహనాలు దగ్ధం
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో పలు కేసుల్లో సీజ్డ్ చేసిన వాహనాలు దగ్ధమయ్యా యి. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ వెను క భాగంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని వాహనాలు పార్కింగ్ చేసిన చోటికి వ్యాపించాయి. మంటల్లో 15 బైక్‌లు, 10 ఆటోలు, నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమ య్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సురేశ్, విజేందర్ రె డ్డి, శ్రవణ్, మారుతి ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
630 మంది
విద్యార్థులు గైర్హాజరు
ఖలీల్‌వాడి : జిల్లాలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం రసాయనశాస్త్రం, వా ణిజ్య శాస్త్రం, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు మొత్తం 19,525 మంది విద్యార్థులకు గాను 18,895 మంది హాజ రయ్యారని పేర్కొన్నారు. 630 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. మొత్తం 58 పరీక్షా కేంద్రాలకుగాను 56 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని పేర్కొ న్నారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 15, హైపవర్ కమిటీ 7, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు మొత్తం 26 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు.
జిల్లా స్థాయి
మౌఖిక పరీక్ష పూర్తి
ఖలీల్‌వాడి: నగరంలోని జవహర్ నవోదయ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి ప్రేరణ ఉత్సవం మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలకు జిల్లాలోని వివిధ యాజమాన్య పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ తదితర అంశాల్లో న్యాయ నిర్ణేతలు పరీక్షలు నిర్వహించారు. మూల్యాంకన వివరాలను ప్రేరణ ఆన్‌లైన్ పోర్టల్ పొందుపర్చినట్లు డీఈవో అశోక్ తెలిపారు. పాల్గొన్న విద్యార్థుల నుంచి ఒక బాలిక, ఒక బాలుడిని ఎంపిక చేసి జాతీయస్థాయిలో జరిగే శిబిరానికి పంపుతామన్నారు. జేఎన్‌వీ నిజాంసాగర్ ప్రిన్సిపల్ రాంబాబు, కోఆర్డినేటర్ ప్రవీణ్, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, స్థానిక జేఎన్‌వీ పాఠశాల ప్రిన్సిపల్ జోజిబాబు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : కామారెడ్డిలో ఫ్ల యింగ్ అకాడమీ ఏర్పాటు చేయా లని ఎమ్మెల్యే కా టిపల్లి వెంకటరమణారెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించారు.


