సమావేశాలకు శాశ్వత వేదిక | - | Sakshi
Sakshi News home page

సమావేశాలకు శాశ్వత వేదిక

Mar 13 2026 8:57 AM | Updated on Mar 13 2026 8:57 AM

మండలాల వారీగా మంజూరైన భవనాలు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : కేంద్ర ప్రభుత్వం ఉపాధిహా మీ పథకం (వీబీజీరామ్‌జీ) కింద గ్రామాల్లో మహి ళా సంఘాల (గ్రామ సమాఖ్య) కోసం శాశ్వత భవనాలను నిర్మిస్తోంది. జిల్లాకు 291 భవనాలు మంజూరు కాగా ఒక్కో దానికి రూ.10లక్షలు ఖర్చు చే స్తోంది. భవన నిర్మాణ బాధ్యతలను పంచాయ తీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖకు అప్పగించగా గ్రామ పంచాయతీలే కాంట్రాక్టర్లను వెతుకుతున్నాయి. కొ న్ని గ్రామాల్లో పనులు ప్రారంభమై గ్రౌండింగ్‌ దశ లో ఉన్నాయి. ఉపాధిహామీ నిధులు ఆలస్యంగా వస్తున్నాయనే కారణంతో చాలా చోట్ల వీవో భవనాలను నిర్మించేందుకు గుత్తేదార్లు ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల స్థల సమస్య కూడా ఉంది. మంజూరైన గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పనులు ప్రారంభించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల వీవో భవనాల కోసం అవసరమున్న గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి ఎంపీడీవో కార్యాలయల ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖకు పంపాయి.

80 స్కూళ్లలో 103 టాయిలెట్లు..

మోర్తాడ్‌(బాల్కొండ) : ఉపాధిహామీ పథకం (వీబీజీరామ్‌జీ) నిధులతో మహిళా సంఘాలకు సొంత భవనాలతోపాటు జిల్లాలోని 80 పాఠశాలల్లో 103 టాయిలెట్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందు కోసం రూ.2.06 కోట్లు కేటాయించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటుండటంతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఒత్తిడి వస్తోంది.

ఆలూర్‌ 09

ఆర్మూర్‌ 02

బాల్కొండ 09

భీమ్‌గల్‌ 22

బోధన్‌ 24

చందూర్‌ 03

ధర్పల్లి 12

డిచ్‌పల్లి 31

డొంకేశ్వర్‌ 12

ఇందల్వాయి 07

జక్రాన్‌పల్లి 16

కమ్మర్‌పల్లి 14

కోటగిరి 10

మాక్లూర్‌ 18

మోర్తాడ్‌ 02

మోస్రా 02

మోపాల్‌ 13

ముప్కాల్‌ 02

నవీపేట్‌ 17

నిజామాబాద్‌ 05

పొతంగల్‌ 15

సాలూరా 12

సిరికొండ 12

వర్ని 05

ఎడపల్లి 11

ఏర్గట్ల 06

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement